Acharya : ఆచార్య కోసం చిరు, చెర్రీ భారీ రెమ్యునరేషన్..!

Acharya : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆచార్య సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు థియేటర్లోకి వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే కీలకపాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాలో నటించిన స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నరన్నది హాట్ టాపిక్ గా మారింది.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కోసం మెగాస్టార్ 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.. ఇక రామ్ చరణ్ తన పాత్రకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. రామ్‌చరణ్‌కు జోడీగా నటించిన పూజా హెగ్డేకి కోటి రూపాయల పారితోషికం ముట్టినట్టుగా తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య కోసం 25 కోట్లు తీసుకున్నాడని కూడా వినిపిస్తోంది.
కాజల్ రెండు కోట్లు, సోనూసూద్ 4 కోట్లు అందుకున్నట్లు సమాచారం. చాలా ఏళ్ల తర్వాత చిరు సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com