Chiranjeevi : అంబటి రాయుడుపై మండి పడుతున్న ప్రేక్షకులు

ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. కొందరు అభిమానులు, ప్రేక్షకులు అతని మాటలపై మండిపడుతున్నారు. నిన్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు మెగాస్టార చిరంజీవిని ఉద్దేశించి అతను చేసిన కొన్ని కామెంట్స్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
మామూలుగానే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం అంతా అలెర్ట్ అవుతుంది. దేశంతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులంతా ఈ దాయాదుల పోరును ఆసక్తిగా చూస్తారు.సెలబ్రిటీస్ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో దుబాయ్ లో ఈ మ్యాచ్ ను మెగాస్టార్ చిరంజీవితో పాటు, సుకుమార్ కూడా ప్రత్యక్షంగా చూశారు. వీళ్లిద్దరూ కలిసి చూడకపోయినా.. అప్పుడప్పుడూ టివిల్లో వీరిని చూపించారు. ఈ క్రమంలో తెలుగు కమెంటేటర్స్ చేసిన వ్యాఖ్యలను ఇన్ డైరెక్ట్ గా సమర్థిస్తూనే.. అంబటి రాయుడు ఒక మాట అన్నాడు.. ''అట్లాని గూడ కాదు.. ఇట్లాంటి మ్యాచ్ ల్లో టివిల్లో ఎక్కువ కనిపిస్తారు కదా.. వేరే మ్యాచ్ ల కనిపించడం తక్కువ ఉంటది. అది పవర్ ఆఫ్ క్రికెట్ అది.. పబ్లిసిటీ స్టంట్ " అన్నాడు.
ఇప్పుడు చిరంజీవికి పబ్లిసిటీ అవసరం లేదు. సుకుమార్ పుష్ప 2 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి, అలాగే ఇండియన్స్ కు బాగా పరిచయం అయ్యాడు. సినిమాలో అతని సిగ్నేచర్ మూమెంట్ అయిన తగ్గేదే లే అనేది అందరూ వాడుతున్నారు. కేవలం మ్యాచ్ చూడడానికి వస్తే పబ్లిసిటీ స్టంట్ అంటాడా అంటూ అంబటి రాయుడుపై విరుచుకుపడుతున్నారు. మామూలుగానే కాస్త దుందుడుకు మనస్తత్వం ఉన్న రాయుడు ఈ విమర్శలపై స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com