Chiranjeevi : చిరంజీవి, అనిల్ రావిపూడి ... ఓ రూమర్

Chiranjeevi :  చిరంజీవి, అనిల్ రావిపూడి ... ఓ రూమర్
X

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో కూడా దూకుడుగా ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాకపోతే ఆయన్ని ఇంప్రెస్ చేసే దర్శకులే తగ్గిపోయారు అని చెప్పాలి. ఇప్పటికీ ఎన్నో కథలు వింటున్నారు. కొత్తవాళ్లైనా.. సీనియర్స్ అయినా ఒకటీ రెండు సినిమాలతో ఆకట్టుకున్న దర్శకులైనా సరే కరెక్ట్ ప్లాట్ ఫామ్ తో వెళితే కథలు వింటున్నారు. బట్ ఇంప్రెస్ చేస్తున్నవాళ్లు తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ రూమర్ హల్చల్ చేస్తోంది.

అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి డ్యూయొల్ రోల్ చేయబోతున్నాడు అనేదే వార్త. నిజానికి ఇప్పటి వరకూ ప్రాపర్ స్టోరీనే చెప్పలేదు అనిల్. కేవలం లైన్ మాత్రమే చెప్పాడట. ప్రస్తుతం పూర్తి కథ సిద్ధం చేస్తున్నాడు. ఇంతలోనే చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో ఇప్పటి వరకైతే ఎలాంటి నిజం లేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే ఇవన్నీ అంటున్నారు. ఒకవేళ డ్యూయొల్ రోల్ చేస్తే ఆ ఆలోచన కరెక్టేనా అని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మెగాస్టార్ ‘డబుల్ రిస్క్’ తీసుకునే బదులు ఆ పాత్రకు వాల్తేర్ వీరయ్యలో రవితేజలా మరో హీరోకు ఛాన్స్ ఇస్తే రజినీకాంత్ లా బ్లాక్ బస్టర్స్ కొట్టేయొచ్చు.

Tags

Next Story