Chiranjeevi : యధా అనిల్ రావిపూడి, తథా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఈ వయసులో కూడా ఆయన చూపిస్తోన్న దూకుడుకు ఎంటైర్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. లేదంటే ఈ ఏజ్ లో నాన్ స్టాప్ షూటింగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేయడం అంటే మాటలా. అఫ్ కోర్స్ అదంతా దర్శకుడు అనిల్ రావిపూడికి చెందాల్సిన క్రెడిట్ అని కూడా చెప్పాలి. అందుకే దర్శకుడు ఫాస్ట్ గా ఉంటే.. చిరంజీవి లాంటి డెడికేటెడ్ హీరోలు కూడా ఆ స్పీడ్ ను అందుకుంటారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ మధ్యే కదా చిరంజీవి, అనిల్ సినిమా స్టార్ట్ అయింది. అదుగో అప్పుడే మూడో షెడ్యూల్ కూడా పూర్తయిందీ అంటూ కొత్త అప్డేట్ తో షాక్ ఇచ్చింది టీమ్. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయిన వీడియోను షేర్ చేసింది.
చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విశ్వంభర తర్వాత చిరంజీవి మరో దర్శకుడితో సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ లోగా తర్వాత చేయాల్సిన అనిల్ రావిపూడి లైన్ లోకి వచ్చాడు. పైగా అతను వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మరింత జోష్ లో ఉన్నాడు. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిపోయింది. 2026 సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ మూవీ పూర్తిగా అనిల్ మార్క్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. మరి చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి కూడా అందరికీ తెలుసు కదా. అనిల్ రైటింగ్ లో మెగాస్టార్ టైమింగ్.. ఊహించుకుంటేనే ఓ రేంజ్ లో ఉంది కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com