Chiranjeevi : చిరంజీవి కాకా.. నువ్వు కేక

Chiranjeevi :  చిరంజీవి కాకా.. నువ్వు కేక
X

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. మన శంకరవర ప్రసాద్ గారు మూవీతో ఆ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు చూస్తే తెలుగు నుంచి ఆల్ టైమ్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ లు క్రియేట్ చేయబోతోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాతి ప్రాజెక్ట్స్ పై ఆల్రెడీ ఫోకస్ చేశాడు చిరంజీవి. నెక్ట్స్ మూవీ బాబీ డైరెక్షన్ లో ఉండబోతోంది అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బాబీ ఆల్రెడీ వాల్తేర్ వీరయ్యతో సూపర్ హిట్ అందించాడు. ఆ కారణంతోనే మరో మూవీకి ఓకే చెప్పాడు.

ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతోన్నమూవీకి ‘కాకా’అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాక లేదంటే కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ బావుంది. వెంటనే ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ టైటిల్ ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తోంది. కాకా అంటే బాబాయ్ అనే అర్థంలో కనిపిస్తుంది. మరి ఆంధ్రలో ఆడియన్స్ ఈ టైటిల్ ను ఎలా తీసుకుంటారు అనే డౌట్స్ కూడా లేవు. ఎందుకంటే ఇదే మాటతో హిందీ పదం కూడా ఉంది కాబట్టి. అదే టైమ్ లో వాల్తేర్ వీరయ్యలో ఉత్తరాంధ్ర యాసతో అదరగొట్టాడు మెగాస్టార్. మరి కాకా లో తెలంగాణలో మెప్పించే అవకాశాలున్నాయి అనిపిస్తుంది. మొత్తంగా ఈ టైటిల్ తో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత చిరంజీవి మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జత కట్టబోతున్నాడు. ఇది కూడా ఆల్రెడీ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

ఇక విశేషం ఏంటంటే.. బాబీ మూవీలో చిరంజీవితో పాటు మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇది ఖచ్చితంగా తెలుగులో వైవిధ్యమైన కాంబినేషన్ గా నిలుస్తుంది. వాల్తేర్ వీరయ్యలో రవితేజను తీసుకున్నాడు బాబీ. మరి ఈ సారి అంతకు మించిన బిగ్గెస్ట్ స్టార్ తో వర్క్ చేయడం మాత్రం పెద్ద ప్లస్ అవుతుంది.

Tags

Next Story