Chiranjeevi - Allu Arjun : అల్లు ‘ఇంటికి’ చిరంజీవి

అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా అంతా ఇదే టాపిక్ నడుస్తోంది. కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే వచ్చే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ జరిగిన విషయాలేం మనసులో పెట్టుకోకుండా వెంటనే అర్జున్ కోసం అతని ఇంటికి వెళ్లాడు. నిజానికి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనుకున్నారు. కానీ పోలీస్ లు వారించారు. ట్రాఫిక్ తో పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని నివారించడంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లాడు. అరవింద్ ఆల్రెడీ కొడుకుతో పాటే ఉన్నాడు. ఇంట్లో అర్జున్ వైఫ్ స్నేహారెడ్డితో పాటు అతని తల్లి ఉన్నారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు చట్ట పరంగా తనవైపు నుంచి ఏం చేయాలో అది చేసే పనిలో ఉన్నాడు మెగాస్టార్.
తన లాయర్లతో కూడా కేస్ కు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ కు కోర్ట్ రిమాండ్ విధిస్తే సోమవారం వరకూ బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకు సంబంధించిన అంశాలు కూడా పరిశీలిస్తున్నారట. ఏదేమైనా తన కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి వెంటనే స్పందించిన మెగా మనసుకు ఫ్యాన్స్ మరోసారి జేజేలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com