Chiranjeevi: క్వారంటీన్‌లో కవిగా మారిన మెగాస్టార్.. ఇంతకీ ఆ కవిత దేనిపై..?

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: మామూలుగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్ మిగతా హీరోలకు పోటీగా పోస్టులు పెడుతుంటారు.

Chiranjeevi: చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడడంతో హోమ్ క్వారంటీన్‌లో ఉంటున్నారు. క్వారంటీన్‌లో ఉన్నప్పుడు కాలక్షేపం కోసం ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ ఉంటారు. ఒకవైపు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూనే.. మరోవైపు తమలోని టాలెంట్స్‌ను బయటికి తీస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో క్వారంటీన్‌లో ఉంటున్న ఆయన.. తనలోని ఎవ్వరికీ తెలియని ఒక కొత్త కోణాన్ని బయటికి తీశారు.

మామూలుగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్ మిగతా హీరోలకు పోటీగా పోస్టులు పెడుతుంటారు. ఆయన మనసుకు నచ్చింది ఏదైనా ఫోటో తీసి వాటిని పోస్ట్ చేస్తుంటారు. ప్రొఫెషనల్ విషయాలకంటే పర్సనల్ విషయాలనే ఎక్కువగా ఇష్టపడతారు మెగాస్టార్. తాజాగా ఆయనకు నచ్చిన ఓ వ్యూను వీడియో తీసి దానికి కాస్త కవిత్వం జోడించి ట్విటర్‌లో షేర్ చేశారు చిరు. ఆయన కవిత్వానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల్లో ఎవరికీ తీరిగ్గా సూర్యోదయాన్ని చూసే తీరిక ఉండట్లేదు. అలాంటి ఓ సూర్యోదయాన్ని చిరు వీడియో తీశారు. ఈ వీడియోలో చంద్రుడు వెళ్లిపోయి సూర్యుడు వచ్చేవరకు ఆకాశం ఎంత అందంగా ఉంటుందో చూపించారు. అంతే కాకుండా దానిపై ఓ కవిత కూడా రాశారు. ఒక మూలగా ఉన్న నెలవంక, దగ్గర్లో ఉన్న శుక్రుడు, ఉదయించబోతున్న సూర్యుడు ఆ కొంటె సూర్యుడిని చూడలేక నెలవంక సిగ్గుతో తొలగినట్లుగా ఉంది' అంటూ ఆయన రాసిన కవిత ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Tags

Read MoreRead Less
Next Story