Chief Minister Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి చిరంజీవి ఫోన్

Chief Minister Vijay :  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి చిరంజీవి ఫోన్
X

తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారి మధ్య నిన్న ఓ ఆత్మీయమైన ఫోన్ సంభాషణ చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత ఆదరణ పొందిన ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, అభిమానాన్ని ఈ సంభాషణ ప్రతిబింబించింది.

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, దివంగత మహానేత ఎం.జి.ఆర్ లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విజయ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటీవల “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రాన్ని వీక్షించినట్లు, ఆ చిత్రంలో చిరంజీవి గారిని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. అలాగే KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి గారి తదుపరి చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ ప్రస్తుతం అభిమానులు మరియు సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది.

Tags

Next Story