Chiranjeevi in Guinness Book : గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి డ్యాన్స్
స్వయంకృషితో ఎదిగి.. ట్రెండ్స్ క్రియేట్ చేసి శిఖరాలు అధిరోహించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటుచేసుకుంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్ అందజేశారు.
ఈ ఈవెంట్ కు చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ లో నమోదు చేయనున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో రెండో అవార్డును దక్కించుకున్నారు.
ఈ ఏడాది ఆయనకు ఈ అరుదైన ఘనత దక్కడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చిరంజీవి నిలిచారు. అరవై ఏళ్లు దాటినా కూడా అదే పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com