Chiranjeevi : మరో మలయాళ రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్.. !

Chiranjeevi: ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు.. ఇందులో గాడ్‌ఫాదర్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి ఇది రీమేక్.. ఈ సినిమాకి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాతో పాటుగా భోళాశంకర్, బాబీ, వెంకీ కుడుములతో సినిమాలను చేస్తున్నారు మెగాస్టార్.
ఇదిలావుండగా చిరంజీవి మరో మలయాళ సినిమా పైన మనసు పారేసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిన బ్రో డాడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
మోహన్‌లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో డాడీ మూవీని తెలుగులో వెంకటేష్, రానా కలిసి చేయాలని అనుకున్నారట. ఇప్పటికే తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత సురేష్ బాబు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే బ్రో డాడీ మూవీ చిరంజీవికి నచ్చడంతో దానిని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా సమాచారం. మరి చూడాలి ఏం జరుగుతుందో.
మరోవైపు చిరంజీవి ఆచార్య సినిమాకి రిలీజ్‌కి సిద్దంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాని ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com