Chiranjeevi: హ్యాపీ హాలోవీన్ అంటూ చిరంజీవి పోస్ట్ వైరల్..

Chiranjeevi: అందరు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి స్టైలే వేరు. పేరుకే సీనియర్ హీరో అయినా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఆయన ఎందరో యంగ్ హీరోలకు పోటీ ఇస్తుంటారు. ముఖ్యంగా చిరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చిరు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
హాలోవీన్ అనేది అమెరికాలో క్రిస్మస్ ముందు జరరుపుకునే ఒక ఢిఫరెంట్ ఫెస్టివల్. ఇప్పుడు ఈ హాలోవీన్ ట్రెండ్ ఇండియాలో కూడా వచ్చేసింది. ఈ హాలోవీన్ ఫెస్టివల్‌లో అందరూ కాస్త భయంకరంగా రెడీ అవుతుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే హాలోవీన్ అంటే ఒక దెయ్యాల పార్టీ లాంటి జరుపుకుంటారు. అలాంటి హాలోవీన్‌కు విషెస్‌ను కాస్త ఢిఫరెంట్‌గానే చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.
చిరు.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హ్యాపీ హాలోవీన్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన వారందరూ చిరు విషెస్ సూపర్ అని.. ఆయన క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. మరికొందరు అయితే ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. ఎంతైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో చిరు తరువాతే ఎవరైనా..
Annayya @KChiruTweets's Instagram story 😁😍#MegastarChiranjeevi #HappyHalloween2021 pic.twitter.com/XBM9VxisWO
— Megastar Chiranjeevi (@ChiruFanClub) October 31, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com