Chiranjeevi: సీనియర్ కెమేరామెన్‌కి చిరంజీవి ఆర్థిక సాయం..

Chiranjeevi: సీనియర్ కెమేరామెన్‌కి చిరంజీవి ఆర్థిక సాయం..
Chiranjeevi: వారం రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ కెమేరా మెన్ పి.దేవరాజ్ తన ఆర్థిక పరిస్థితిని గురించి వాపోతూ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు.

Chiranjeevi: వారం రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ కెమేరా మెన్ పి.దేవరాజ్ తన ఆర్థిక పరిస్థితిని గురించి వాపోతూ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఆపదలో ఉన్నా సాయం చేయడంలో ముందుంటారు మెగా స్టార్ చిరంజీవి. దేవరాజ్ కెమేరా మెన్‌గా చిరంజీవి పలు చిత్రాలు కూడా చేశారు.

ఒకానొక సమయంలో బాగా బతికిన వ్యక్తి ఈ రోజు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.. అతడి పరిస్థితికి చలించిపోయిన చిరంజీవి అయిదు లక్షలు ఆర్థిక సాయం అందించి తన మంచి మనసు చాటుకున్నారు.

80, 90వ దశకంలో దేవరాజ్‌కు కెమేరామెన్‌గా మంచి పేరు ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సూపర్ స్టార్స్‌తో దేవరాజ్ వర్క్ చేశారు. తెలుగులోనే కాక, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో దాదాపు 300లకు పైగా సినిమాలకు దేవరాజ్ కెమేరామెన్‌గా పనిచేశారు.

అవకాశాలు వచ్చినప్పుడు ఆర్ధిక పరిస్థితి బావుంది.. ఇప్పుడు అవకాశాలు లేవు, పని చేసే శక్తీ లేదు.. ఆర్ధిక పరిస్థితి దుర్భరంగా ఉంది. ఆదుకునే వారు లేరు అని వాపోతున్నారు. ఇండస్ట్రీ పెద్దలు సీనియర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సాయం చేయాలని అభ్యర్ధించారు దేవరాజ్.

తన పరిస్థితి తెలుసుకుని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి నెలా రూ.5 వేలు, మురళీ మోహన్ రూ.3 వేలు పంపుతుంటారని తెలిపారు. సొంత ఇల్లు లేదు.. రూ.8వేలు రెంట్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారు దేవరాజ్. మనసున్న మారాజులు సాయం చేస్తే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటానంటున్నారు. చిరంజీవి చేసిన సాయానికి ఉప్పొంగిపోతున్నారు దేవరాజ్.

Tags

Read MoreRead Less
Next Story