Chiranjeevi : చిరంజీవికి 'అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్' అవార్డు
X
By - Manikanta |28 Sept 2024 6:30 PM IST
ప్రతిష్టాత్మక ఐఫా 2024 అవార్డుల కార్యక్రమం అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకు భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోహీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవికి 'అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియా' అవార్డు దక్కింది. ఈ అవార్డను నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి చిరంజీవికి అందజేశారు. దానికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com