Chiranjeevi: రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయనున్న చిరంజీవి.. తనకోసమే..

Chiranjeevi: రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయనున్న చిరంజీవి.. తనకోసమే..
Chiranjeevi: త్వరలోనే చిరు నటించబోయే ఓ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరు అని టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరికంటే వేగంగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒక సినిమాకు, ఇంకొక సినిమాకు పెద్దగా గ్యాప్ తీసుకోవద్దు అనుకుంటున్న మెగాస్టార్ వెంటవెంటనే కథలు వింటూ.. నచ్చిన కథలను ఓకే చేస్తున్నారు. అయితే త్వరలోనే చిరు నటించబోయే ఓ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరు అని టాక్ వినిపిస్తోంది. అది కూడా తన కూతురు కోసమని తెలుస్తోంది.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుందని మూవీ టీమ్‌తో పాటు మెగా అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివకు ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం, చిరు, చరణ్ కలిసి మొదటిసారి ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్ చేయడం కూడా ఆచార్యకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి.

చిరంజీవి.. తన కూతురు సుస్మిత కొణిదెలతో ఓ సినిమా ప్లాన్ చేస్తు్న్నట్టు సమాచారం. ఇంతకు ముందు వరకు సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుస్మిత.. ఇటీవల గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారింది. అయితే తన నిర్మాణంలో ఒక సినిమా చేయాలని చిరు అనుకుంటున్నారట. అంతే కాకుండా దీనికి ఏ రెమ్యునరేషన్ కూడా తీసుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.Tags

Read MoreRead Less
Next Story