సినిమా

Chiranjeevi : 'భవదీయుడు భగత్‌సింగ్‌' నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని లీక్‌ చేసిన చిరు..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ..

Chiranjeevi : భవదీయుడు భగత్‌సింగ్‌ నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని లీక్‌ చేసిన చిరు..!
X

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' .. ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది... అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ తో దర్శకుడు హరీశ్‌శంకర్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'భవదీయుడు భగత్‌సింగ్‌' మూవీ నుంచి ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని లీక్‌ చేశారు చిరంజీవి.. ''విలన్‌పై పోరాటం చేయడానికి ఓ లక్షమంది విద్యార్థులతో పవన్‌ కల్యాణ్‌ రోడ్డెక్కుతాడు.. అది చూసిన విలన్‌.. 'ఏంటయ్యా వీడి ధైర్యం. ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నారనా?' అని ప్రశ్నించగానే.. విలన్‌ పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. 'లేదు సర్‌. ఆ లక్ష మంది ముందు ఈయన ఉన్నాడని వాళ్లకు ధైర్యం' అని చెబుతాడు'' ఈ డైలాగ్ హరీష్ తనకి చెప్పినట్టుగా చిరు చెప్పుకొచ్చారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES