Nagarjuna: జగన్‌కు చిరంజీవి అంటే ఇష్టం.. నేనే వెళ్లమన్నా: నాగార్జున

Nagarjuna: ఏపీలో సినిమా టికెట్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మొన్న మొన్నటి వరకు పేర్ని నాని, ఆర్జీవీ ఈ విషయంపై వారిద్దరి మద్య ట్వీట్ల వర్షం కురిసింది.. అయితే ఇది ఏ ఒక్కరో పరిష్కరించాల్సిన సమస్య కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని మొన్న బాలకృష్ణ కూడా అన్నారు.
తాజాగా ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ మా అందరి కోసమే చిరంజీవి జగన్‌తో సమావేశమయ్యారు. బంగార్రాజు సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్లలేకపోయా. జగన్‌కు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి వెళ్లానన్నారు. నేను కూడా వెళ్లమనే సలహా ఇచ్చా. ఇద్దరి భేటీ ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నానని నాగార్జున అన్నారు.
కింగ్ నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజుతో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com