Chiranjeevi : నేను చేసిన ఆ సినిమా వెంకటేశ్ చేస్తే ఇంకోలా ఉండేది : చిరంజీవి

Chiranjeevi : నేను చేసిన ఆ సినిమా వెంకటేశ్ చేస్తే ఇంకోలా ఉండేది : చిరంజీవి
Chiranjeevi : కథల ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువశాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు..

Chiranjeevi : కథల ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువశాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు.. ఒక్కోసారి తాను విన్న కథలు మరో హీరోకి సూట్ అవుతాయి అనుకుంటే మొహమాటం లేకుండా చెబుతుంటారు.. అలా డాడీ సినిమా విషయంలో జరిగింది. 2001లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది.. కానీ చిరంజీవి మార్క్ సినిమా అనిపించుకోలేకపోయింది.

అయితే ఈ కథ విన్నాక చిరు... మరో ఆలోచన లేకుండా వెంకటేశ్‌ కి అయితే ఈ కథ బాగుంటుందని సలహా ఇచ్చారట.. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. " డాడీ కథ వినగానే ఇది వెంకటేష్ కి బాగా సూట్ అవుతుందని రచయిత భూపతిరాజాకి చెప్పాను.. ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది. మీకైతే ఫ్యామిలీమెన్‌గా కాస్త వెరైటీగా ఉంటుందని భూపతిరాజా నన్ను కన్వీన్స్ చేశారు.

చిన్న పిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుందని పలువురు సలహా ఇవ్వడంతో బలవంతంగా ఒప్పుకొన్నాను ... చివరికి కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది.. సినిమా చూశాక వెంకటేష్ ఫోన్ చేసి.. 'భలే సినిమా అండీ. నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండీ' అనేశాడు. 'నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేశ్‌. కానీ వినలేదు " అని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story