Chiranjeevi: మదర్స్ డే స్పెషల్.. అమ్మతో మెగా బ్రదర్స్ లంచ్..

Chiranjeevi: మదర్స్ డేను కొంతమంది నమ్మరు. కానీ కొందరు మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తారు. అంటే మదర్స్ డేపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కానీ చాలావరకు సెలబ్రిటీలు మాత్రం వారికి నచ్చినట్టుగా మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ తల్లితో కలిసి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి ఇష్టపడతారు. అందుకే ఎప్పటికప్పుడు తనకు నచ్చిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి పోస్ట్ చేసిన మదర్స్ డే వీడియో మెగా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయినా కూడా మదర్స్ డే సందర్భంగా తన అమ్మతో కలిసి లంచ్ చేశారు. ఈ ముగ్గురు మెగా బ్రదర్స్‌ను ఒకటే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు.. ఈ వీడియోకు తెగ లైకులు, షేర్లు కొట్టేస్తున్నారు. 'అమ్మలందరికీ అభివందనములు' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు చిరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com