Chiranjeevi: కూతురి సినిమాకు చిరంజీవి సపోర్ట్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మెగా కుటుంబం నుండి హీరోయిన్‌గా మాత్రం నాగబాబు కూతురు నిహారికా మాత్రమే పరిచయమయ్యింది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కూడా గత కొంతకాలంగా సినీరంగంలోనే పనిచేస్తోంది. కానీ తెరపైన కాదు.. తెర వెనుక. ఇటీవల ఆమె సినీ రంగంలో కొత్త బాధ్యతలు స్వీకరించింది. దానికి చిరంజీవి సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు.
గత కొంతకాలంగా సుస్మిత కొణిదెల సినీ రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది. తన తండ్రి చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150', 'సైరా' సినిమాలకు తానే డిజైనర్‌గా చేసింది. అయితే ఇటీవల తాను నిర్మాతగా కూడా మారింది. తమిళంలో సూపర్ హిట్ అయిన '8 తొట్టక్కళ్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సుస్మిత ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. ఫైనల్‌గా ఇంత కాలానికి తన కల నిజమయ్యింది.
'8 తొట్టక్కళ్ సినిమాను 'సేనాపతి' పేరుతో తెలుగులో రీమేక్ చేసింది సుస్మిత కొణిదెల. నరేశ్ అగస్త్య, రాజేంద్ర ప్రసాద్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీలో విడుదలయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకే తన కూతురికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి.
Hearty Congrats Team #SENAPATHI !!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 5, 2022
A terrific thriller!#SenapathionAha #DrRajendraPrasad @Pavansadineni #LSVishnuPrasad@sushkonidela @ahavideoIN pic.twitter.com/WJcSBeqhK3
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com