Chiranjeevi: కంగ్రాట్స్ డియర్.. చరణ్‌కు 'చిరు' ప్రశంసలు..

Chiranjeevi: తన రక్తం పంచుకు పుట్టిన కొడుకు తన కంటే ఎత్తుకు ఎదగాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు.. కొడుకు విజయాన్ని చూసి ఆనందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా. ఫ్యూచర్ ఆప్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా తన తనయుడు రామ్ చరణ్ అవార్డు సొంతం చేసుకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
చరణ్ అవార్డు అందుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేను కోరుకుంటున్నాం అని సోషల్ మీడియా వేదికగా కొడుకు చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు చిరంజీవి. ఈ పోస్ట్‌పై చరణ్ స్పందిస్తూ.. లవ్ యూ అప్పా అని రిప్లై ఇచ్చారు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను ఆదివారం అందజేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ .. నటనలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని, ఈ అవార్డు ఆయనకే అంకితం చేస్తున్నానని అన్నారు.
కథ ఏదైనా సరే అది ఒక వ్యక్తిగత అనుభవం. సమస్య నుంచి మొదలవుతుంది. 1997లో మా కుటుంబానికి ఎంతో ఆప్తుడైన ఒక వ్యక్తి.. ఆపరేషన్ సమయంలో రక్తం దొరక్క కన్నుమూశారు. 20 శతాబ్ధంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ బాధ నుంచే నాన్న బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టారు. ఇప్పుడు అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని చరణ్ అన్నారు.
ఇంకా.. చరణ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో దిగడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు రాజమౌళికి ఈ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com