Chiranjeevi : చిత్రపురిలో ఆస్పత్రి కట్టిస్తున్నా : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : చిత్రపురిలో ఆస్పత్రి కట్టిస్తున్నా : మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi : సినీ ఆర్టిస్టుల కోసం చిత్రపురిలో ఓ ప్రత్యేకమైన ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు.

Chiranjeevi : సేవా కార్యక్రమాలు, మెగాస్టార్ ఈ రెండింటినీ వేరు చేసి చూడలేము. సినీ ఆర్టిస్టుల కోసం చిత్రపురిలో ఓ ప్రత్యేకమైన ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రిని నెలకొల్పుతానన్నారు. ఇదే సమయానికి వచ్చే ఏడాది ఆస్పత్రి నిర్మాణం పూర్తయి సేవలు ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. పార్క్ హయత్ హోటల్‌లో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి నిర్మాణం గురించి మాట్లాడారు. పేదలకు సేవ చేస్తే వచ్చే తృప్తి అంతా ఇంతా కాదన్నారు. సినిమా సక్సస్ అయిన దానికంటే వచ్చే సంతోషం.. సేవ చేసినప్పుడు నాకు వస్తుందని అన్నారు మెగాస్టార్.

ఆస్పత్రి కట్టిస్తానని చిరు ప్రకటించడంతో అక్కడ స్టేజిపైన ఉన్న శ్రీకాంత్, తరుణ్, తమన్, సుధీర్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమన్ మాట్లాడుతూ.. నేను కూడా ఓ మ్యూజికల్ షో చేసి.. దాని నుంచి వచ్చిన డబ్బులను ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story