Chiranjeevi: బడా ఓటీటీ సంస్థకు చిరు షాక్.. రెండు క్రేజీ ఆఫర్లకు నో..

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు పెరుగుతున్న క్రేజ్ చూసి నటీనటులంతా వాటివైపు అడుగులు వేస్తున్నారు.

Chiranjeevi: ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు పెరుగుతున్న క్రేజ్ చూసి సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా నటీనటులంతా వాటివైపు అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలంటే సినిమా ఒక్కటే మార్గం కాదని.. ఓటీటీల్లో, బుల్లితెరపై కూడా అలరించాలని నటీనటులు భావిస్తున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం వెండితెరకే పరిమితమవుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.

బిగ్ స్క్రీన్‌పై సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీల్లోని వెబ్ ఫిల్మ్స్‌కు, వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఏర్పడింది. అయితే తాజాగా ఒక వెబ్ ఫిల్మ్‌లో నటించడానికి మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించిందట పేరున్న ఓటీటీ సంస్థ. కేవలం 25 రోజుల కాల్ షీట్స్‌ను మాత్రమే వారు కోరారట. కానీ చిరంజీవి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మాస్‌తో పాటు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీనే అయినా వెబ్ ఫిల్మ్ చేయడానికి చిరు ఆసక్తి చూపించట్లేదని సమాచారం.

గంట నిడివే అయినా వెబ్ ఫిల్మ్‌కు నో చెప్పడంతో.. చిరంజీవిని ఒక వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేయాలని రిక్వెస్ట్ చేసిందట ఆ ఓటీటీ సంస్థ. దానికి కూడా చిరు ఎస్ చెప్పలేదట. తమ యాక్టింగ్ బిగ్ స్క్రీన్‌కే పరిమితమని కొందరు స్టార్ హీరోలు కేవలం సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. కానీ చిరు ఫ్యాన్స్ మాత్రం బాస్ డిజిటల్ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story