Chiranjeevi: కౌంటర్లు వేయడం నా నైజం కాదు..: రోజా వ్యాఖ్యలపై చిరంజీవి

Chiranjeevi: కౌంటర్లు వేయడం నా నైజం కాదు..: రోజా వ్యాఖ్యలపై చిరంజీవి
X
Chiranjeevi: అధికార పార్టీలో ఉన్నవారు ప్రతి పక్ష పార్టీలపై దుమ్మెత్తి పోయడం సహజం.. అది కూడా స్థాయిని, పరిమితిని మించకుండా ఉంటే అభ్యతరం ఉండదు..

Chiranjeevi: అధికార పార్టీలో ఉన్నవారు ప్రతి పక్ష పార్టీలపై దుమ్మెత్తి పోయడం సహజం.. అది కూడా స్థాయిని, పరిమితిని మించకుండా ఉంటే అభ్యతరం ఉండదు.. కానీ టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడితే రాజకీయాలు పక్కన పెట్టి మనసున్న ప్రతి ఒక్కరికీ ఆ మాటలు గుచ్చుకుంటాయి. బాధనిపిస్తాయి. ఏపీ మంత్రి రోజా మెగా ఫ్యామిలీపై అలాంటి వ్యాఖ్యలే చేసి చిరంజీవి నొచ్చుకునేలా చేసింది. అయినా ఆయన ఎంతో విజ్ఞతతో ఆ వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టదలిచారు.



రోజూ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలనుకోవట్లేదని చెప్పారు. తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన రోజా చేసిన విమర్శలపై మాట్లాడుతూ... ఆ సమయానికి ఆమె అలా అనాల్సి వచ్చిందేమో.. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. వాళ్ల వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం అనేది నా స్థాయిని నేనే తగ్గించుకున్నట్లు అవుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, ఇప్పుడైనా ఎదుటివారు ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలనుకోలేదు.. ఎందుకంటే వాళ్లు నాతోపాటు నటించారు. మా ఇంటికి వచ్చారు..




మాతో కలిసి భోజనం చేశారు. సొంతవారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రేమ, వాత్సల్యానికి విలువ ఇచ్చే మనిషిని నేను. వాళ్లకు కౌంటర్లు ఇచ్చి, వాళ్లను తగ్గించేసి, నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసుకోలేను. వాళ్లతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటా. రాజకీయాలంటే ఇలాగే ఉండాలా.. వేరేలా ఉండకూడదా అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Tags

Next Story