Chiranjeevi: సిద్ధ పాత్ర చరణ్ చేయకపోయుంటే ఎవరు చేసేవారంటే..: చిరంజీవి

Chiranjeevi: మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా శుక్రవారం థియేటర్లలో సందడికి మొదలయ్యింది. విడుదలకు కొన్నిరోజులే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది మూవీ టీమ్. చిరు, చరణ్‌లను ఒకే స్టే్జీపై చూస్తూ మెగా అభిమానులు సంతోషపడుతున్నారు. అయితే ఆచార్యలో రామ్ చరణ్.. సిద్ధ పాత్రకు ఒప్పుకోకపోయింటే ఇంకెవరు చేసేవారో చిరంజీవి రివీల్ చేశారు.
ఆచార్య చిత్రంలో చిరంజీవి.. ఆచార్య పాత్రలో కనిపించగా రామ్ చరణ్.. సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మామూలుగా రాజమౌళి తనకు కమిట్ అయిన హీరోలు వేరే సినిమాలలో నటిస్తే ఒప్పుకోడు కానీ చిరు కోసం ఒప్పుకున్నాడు.
ఒకవేళ రామ్ చరణ్ చేసే పరిస్థితి లేకపోతే సిద్ధ పాత్ర కోసం పవన్ కళ్యాణ్‌ను తీసుకునేవాళ్లమని రివీల్ చేశారు చిరంజీవి. ఇది విన్న అభిమానులు ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చాలా బాగుండేదని జస్ట్ మిస్ అయ్యిందని అనుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఎప్పుడూ ఒకే వేదికపై చూడాలని ఆశపడే మెగా అభిమానులకు వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఫుల్ ఫీస్ట్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com