Chiranjeevi: క్వారంటీన్‌లో చిరంజీవి.. తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్..

Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో చాలామంది హోమ్ క్వారంటీన్‌లో ఉంటూనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం క్వారంటీన్‌లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మెగాస్టార్.. తాజాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
చిరంజీవి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలతో పర్సనల్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటారు. నేడు చిరంజీవి తల్లి పుట్టినరోజు కావడంతో ఆమెకు స్పెషల్ విషెస్‌ను కూడా సోషల్ మీడియా ద్వారానే తెలిపారు చిరు. ఆ ఎమోషనల్ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
'అమ్మ జన్మదిన శుభాకాంక్షలు.. క్వారంటీన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో శంకరబాబు' అని తన తల్లి, భార్యతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు చిరు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ కావడంతో తన తల్లి ముద్దుగా ఆయనను శంకర్ బాబు అని పిలుచుకుంటుందని తెలుస్తోంది.
అమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com