Raviteja : రవితేజకు చిరంజీవి షాక్ ఇస్తున్నాడా

Raviteja :  రవితేజకు చిరంజీవి షాక్ ఇస్తున్నాడా
X

స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ ఆ తర్వాతి హీరోల సినిమాలకు ఇబ్బందిగా మారతాయి. సంక్రాంతి వంటి టైమ్ లో స్టార్స్ దే హవా. సమ్మర్ సీజన్ లో కూడా బెస్ట్ డేట్స్ అన్నీ టాప్ హీరోలే కొట్టేస్తారు. ఇక మిగిలిన హీరోలు ముందుగా అనౌన్స్ చేసినా పెద్దవాళ్లు వస్తున్నారంటే తప్పుకోక తప్పదు. మరి తప్పుకుంటాడో లేదో కానీ ప్రస్తుతం రవితేజ డేట్ పై మెగాస్టార్ కన్ను పడిందంటున్నారు. అఫ్ కోర్స్ ఇది మెగాస్టార్ స్వయంగా చేసేదేం కాదు. బిజినెస్ లెక్కలను బట్టి మేకర్స్ తీసుకునే నిర్ణయం.

మే 9న మాస్ మహరాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర చిత్రాన్ని విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. నిజానికి ఈ మూవీని సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలనుకున్నా.. రవితేజకు ప్రమాదం జరగడంతో షూటింగ్ ఆలస్యం అయింది. అందుకే సమ్మర్ లో మే 9 అనుకున్నారు. అయితే అదే డేట్ కు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

విశ్వంభర కూడా సంక్రాంతికే రావాలి. కానీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాగాలేదని మళ్లీ చేస్తున్నారు. నాగ్ అశ్విన్, వివి వినాయక్ పర్యవేక్షణలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయనే టాక్ ఉంది. వీటితో పాటు ఓ పాట షూటింగ్ బ్యాలన్స్ ఆ పాట కోసం చిరంజీవి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మెగాస్టార్ కు లక్కీ డేట్ గా చెప్పుకునే మే 9న విడుదల చేయడం గురించి అఫీషియల్ న్యూస్ రాలేదు కానీ.. మేకర్స్ మాత్రం ఆ డేట్ కే రావాలని ప్రయత్నిస్తున్నారట. మరి చిరంజీవి వస్తే.. రవితేజ తప్పుకుంటాడా లేక ఈ వాల్తేర్ వీరయ్యతో తలపడతాడా అనేది చూడాలి.

Tags

Next Story