Chiranjeevi: 'ఇలా చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది': చరణ్‌కు చిరు బర్త్‌డే విషెస్..

Chiranjeevi: ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఉన్న క్రేజే వేరే. అందులోనూ ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ బాండింగ్ చూసి చాలా ముచ్చటపడిపోతుంటారు మెగా అభిమానులు. వీరిద్దరు సందర్భం ఉన్నప్పుడల్లా కలిసి తమ అభిమానుల కోసం వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో తనదైన స్టైల్‌లో బర్త్ డే విషెస్‌ను తెలిపాడు చిరు.
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగాడు చిరంజీవి. ఆయన నట వారసుడిగా హీరోగా పరిచయమయ్యాడు రామ్ చరణ్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవి కుమారుడిగా ఉన్న చరణ్.. మెల్లగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల విడుదలయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్ నటవిశ్వరూపం చూసి ప్రేక్షకులు శభాష్ అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఏ సందర్భం వచ్చినా.. తన అభిమానులకు ఏదైనా చెప్పాలనిపించినా.. సోషల్ మీడియానే వేదికగా ఉపయోగించుకుంటున్నారు చిరు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశాడు.
'రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది. అయితే ఈ occasion లో రామ్ చరణ్ పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా తను నన్ను ఎప్పుడు గర్వపడేలా చేస్తాడు. తనే నా గౌరవం కూడా.' అని రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు చిరంజీవి. దానితో పాటు 'ఆచార్య' సినిమాలోని ఓ స్టిల్‌ను కూడా జతచేశాడు.
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com