Chiranjeevi_VarunTej: నాకంటే నీదే బావుంది.. నాకు కుళ్లుగా ఉంది.. : వరుణ్‌తో చిరు

Chiranjeevi_VarunTej: నాకంటే నీదే బావుంది.. నాకు కుళ్లుగా ఉంది.. : వరుణ్‌తో చిరు
Chiranjeevi_VarunTej: అందరూ కల్సుకోవడానికి ఏ సందర్భం దొరుకుంతుందా అని ఎదురు చూసే మెగా ఫ్యామిలీకి బోగి పండుగ బాగా కలిసొచ్చింది.

Chiranjeevi_VarunTej: మామూలు రోజుల్లో ఎవరిళ్లలో వాళ్లు ఉన్నా పండగ రోజుల్లో అందరూ ఒక చోట కలుసుకుంటే ఎంత బావుంటుంది.. అసలు అప్పుడే నిజమైన పండగ వచ్చినట్లు ఉంటుంది. తీపి కబుర్లు, సరదా పనులు.. వావ్ వాటే బ్యూటిఫుల్ అకేషన్ అనిపించకమానదు.. అందరూ కల్సుకోవడానికి ఏ సందర్భం దొరుకుంతుందా అని ఎదురు చూసే మెగా ఫ్యామిలీకి బోగి పండుగ బాగా కలిసొచ్చింది.

ఎప్పటిలానే ఈసారి కూడా మెగా స్టార్స్ అంతా ఒక చోట చేరారు.. అందరూ కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు.. వరుణ్ తేజ్, చిరంజీవి గరిటె పట్టి పెనం మీద దోసెలు వేశారు.. చల్లటి వాతావరణంలో వేడి దోశలు.. అందులో వేసేది పెదనాన్న, పెద్దబ్బాయ్.. ఇంక టేస్ట్ అదుర్సే అనుకున్నారంతా.. ఎంతైనా యంగ్ వరుణ్.. ఓ చెఫ్ మాదిరిగానే వేస్తున్న దోశను చూశారు చిరంజీవి.. అంతే తను వేస్తున్న దోశ అంత బాగా రాలేదు.. వరుణ్‌ది చూడబోతే చాలా బాగా వచ్చింది.. అందుకే ఆ దోశని కరాబు చేసేసారు.. నాకు కుళ్లుగా ఉంది.. ఇది దోశ కాదు ఉప్మా అని వరుణ్ వేసిన దోశని చెడగొట్టారు చిరు.

బాస్‌తో 101వ దోశ అన్న క్యాప్షన్‌తో వరుణ్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక మెగా ముద్దుల తనయ నిహారిక సంక్రాంతి ముగ్గులను, వరుణ్ దేశలను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న సన్నివేశాలను వీడియో తీసి ఇన్‌స్టాలో పంచుకుంది.



Tags

Read MoreRead Less
Next Story