Chiranjeevi: ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఆ అనుభవం నాకూ ఉంది: చిరంజీవి

Chiranjeevi: ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఆ అనుభవం నాకూ ఉంది: చిరంజీవి
Chiranjeevi: సినిమా పిచ్చి ఉంటే ఏ హీరో సినిమా వచ్చినా వదిలిపెట్టకుండా చూసేస్తారు. అదే హీరో మీద అభిమానం ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.

First Day First Show Pre Release Event: సినిమా పిచ్చి ఉంటే ఏ హీరో సినిమా వచ్చినా వదిలిపెట్టకుండా చూసేస్తారు. అదే హీరో మీద అభిమానం ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇంట్లో చీవాట్లు తిన్నా, క్యూలో నిల్చుని చొక్కాలు చింపేసుకున్నా టిక్కెట్టు దొరికి సినిమా చూస్తే అన్నీ మర్చిపోతారు.. ఆ సంతోషాన్ని స్నేహితులతో పంచుకుంటారు.

సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఆనందాన్ని అందరితో చెప్పి, హీరో ఎలా ఉన్నాడు, ఎలా చేశాడో అంతా వద్దంటున్నా వినకుండా వివరించేస్తుంటారు. అది ఆ హీరోపై అతడికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైందట. ఎన్టీ రామారావు సినిమాకు మొదటి రోజే వెళ్లి నాన్న చేతిలో దెబ్బలు తిన్నారట.

శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. నాన్న.. మమ్మల్ని ఎప్పుడూ కుర్చీ టికెట్‌కి పంపించేవారు.

అయితే నేను, తమ్ముడు నాగబాబు, స్నేహితుడు పూర్ణ కలిసి ఏవిఎం వారి రాము సినిమాకు నేల టికెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. టికెట్లు తీసుకురావడానికి నాగబాబు తోసుకుంటూ క్యూలైన్లో నిలబడి మొత్తానికి పెద్ద యుద్దమే చేసి టికెట్లు సంపాదించాడు. బట్టలు నలిగిపోయి, మొహం అంతా ఎర్రగా కమిలిపోయి, జుట్టంతా చెదిరిపోయి వుంది వాడి అవతారం.

ఇంతలో అమ్మానాన్న అదే థియేటర్‌‌లో మొదటి ఆట చూసి వస్తున్నారు. నాగబాబుని చూసి నాన్నకి పిచ్చి కోపం వచ్చింది, అక్కడే గోడకి కట్టి ఉన్న కొబ్బరి మట్ట తీసుకుని నేల టికెట్‌కి వెళతారా.. వాడికి ఏమన్నా అయితే అని కొబ్బరి మట్టతో కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకొస్తే నాకు షివరింగ్ వచ్చేస్తుంది అని ఆనాటి అనుభవాన్ని పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story