Chiranjeevi : ఆ రెండు సినిమాలపై 'చిరు'జల్లులు.. ఫిల్మ్ నగర్‌లో జోష్..

Chiranjeeevi : నిన్న ఒకే రోజు విడుదలైన 'బింబిసార' 'సీతారామం' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ రెండు సినిమాల విజయంపై చిత్రప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చిన సినిమాలు పెద్దహిట్ కాకపోవడంతో టాలీవుడ్ నిర్మాతల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నిరాశను తొలగించి మరింత ఉత్సాహాన్ని పెంచారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బింబిసార, సీతారామం చిత్ర యూనిట్ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరో సారి రుజువైంది* అని చిరు స్పష్టం చేశారు.
ఇటు విజయదేవరకొండ కూడా రెండు చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. "మీ రెండు సినిమాల గురించి అద్భుతమైన విషయాలు వింటున్న.. చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు" విజయదేవరకొండ ట్వీట్ చేశారు. చాలా రోజుల తరువాత థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనబడడంతో సంతోషంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com