Chiranjeevi - Balayya : ఈ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలయ్య కాబోతోందా..

Chiranjeevi - Balayya :  ఈ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలయ్య కాబోతోందా..
X

బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్స్ జరిగితే ఫ్యాన్స్ లో వచ్చే కిక్కే వేరు. ఆడియన్స్ కూడా ఆ పోటీని ఆసక్తిగా చూస్తారు. ఇక వెటరన్స్ మధ్య పోటీ అంటే చెప్పేదేముందీ. పాత రికార్డులు తీస్తారు. ఎవరిది అప్పర్ హ్యాండ్ అని లెక్కలు వేస్తుంటారు. రాబోయే సంక్రాంతి కూడా అలాంటి వేదిక కాబోతోంది. ఈ సారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఉంది. ఈ మూవీని జనవరి 10న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. అదే టైమ్ కు మాస్ మహరాజా రవితేజ మూవీ కూడా అనౌన్స్ అయింది. అయితే ఈ మూవీ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల రవితేజ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో షూటింగ్ ఇన్ టైమ్ లో కంప్లీట్ కావడం కష్టం. అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టే. ఇక తమిళ్ నుంచి అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని తెలుగులోనూ సంక్రాంతికే డబ్బింగ్ మూవీగా విడుదల చేస్తున్నారు.

సో.. పోటీ మరీ పెద్దగా ఏం లేదు. అందుకే తనూ బరిలోకి దిగుతున్నాడు బాలయ్య. బాలకృష్ణ నటిస్తోన్న ఎన్బీకే 109 మూవీని డిసెంబర్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. నిజానికి టీమ్ కూడా ఆ దిశగానే చిత్రీకరణ పూర్తి చేస్తోంది. అయితే ఇప్పుడు సంక్రాంతికి పెద్ద పోటీ లేదు కాబట్టి.. ఆ టైమ్ లో విడదల చేస్తే బెటర్ అని భావించారు. అందుకే ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ మూవీని జనవరి 11 లేదా 12న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. అంటే సంక్రాంతి ఓ రకంగా మెగాస్టార్ వర్సెస్ బాలయ్యగా మారబోతోందనుకోవచ్చు.

విశ్వంభర ఫిక్షన్ ఫాంటసీ మిక్స్ అయిన యాక్షన్ మూవీ. బాలయ్య మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. సో కాంపిటీషన్ స్ట్రాంగ్ గానే ఉండబోతోంది. మరి ఈ వెటరన్స్ లో విన్నర్ ఎవరో.. చూడాలి.

Tags

Next Story