ఆ సినిమాలో రాశిని హీరోయిన్‌గా రికమండ్ చేసింది ఎవరో తెలుసా..

ఆ సినిమాలో రాశిని హీరోయిన్‌గా రికమండ్ చేసింది ఎవరో తెలుసా..
ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది కూడా. పవన్ కళ్యాణ్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. రాశికి మరి కొన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది.

అన్నయ్య అంటే ఎంత అభిమానమో.. అంత కంటే ఎక్కువ అభిమానం వదిన సురేఖ అంటే పవన్ కళ్యాణ్‌కి. గోకులంలో సీత చిత్రంలో నటించే హీరోయిన్‌ని వదిన సెలక్ట్ చేసిందంటే తిరుగేముంటుంది. వెంటనే ఓకే చేశాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది కూడా. పవన్ కళ్యాణ్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. రాశికి మరి కొన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పటికే ఇండస్ట్రీతో పరిచయం ఉన్న రాశికి కెమెరా ముందు నటించడం కొత్త కాదు. గ్యాంగ్ లీడర్ హీందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్‌లో చిరంజీవి అన్న కుమార్తెగా రాశి నటించింది. అలా చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న పరిచయం కారణంగా ఓ రోజు వాళ్ల ఫ్యామిలీని కలిశారు.

రాశీ తన ఆల్బమ్ తీసుకుని తండ్రితో కలిసి వెళ్లింది. అక్కడే ఉన్న చిరంజీవి భార్య సురేఖ.. ఫోటోలు బావున్నాయంటూ కితాబిచ్చారు. అన్నీ ఫోటోలు ట్రెడిషినల్ డ్రెస్‌లో ఉన్నాయి. కొన్ని మోడ్రన్ డ్రెస్‌లో కూడా ఫోటోలు తీయించి చూద్దామన్నారు సురేఖ.

ఆ ఫోటోలు కూడా చూసిన తరువాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వస్తున్న గోకులంలో సీతకు రాశిని రికమండ్ చేశారు ఆమె. అలా రాశి గోకులంలో సీత సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాశి స్వయంగా ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story