Chiranjeevi: ఉక్రెయిన్ లో భారతీయ వైద్యుడు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi: ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా నగరాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులను ఖాళీ చేయిస్తున్నప్పుడు, ప్రజలు తమ పెంపుడు జంతువులను విడిచి పెట్టి రావడానికి ఇష్టపడడట్లేదు. అవి కూడా తమ కుటుంబంలో భాగమే వాటిని వదిలి ఎలా రావాలి అని అంటున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గిరికుమార్ పాటిల్ అనే వ్యక్తి 2007లో మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడే ఆర్థోపెడీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి రెండు పెంపుడు జంతువులు ఉన్నాయి, వాటిలో ఒకటి 20 నెలల జాగ్వర్, మరొకటి ఆరు నెలల వయస్సున్న పాంథర్.
బాంబుల మోత కారణంగా జంతువులు బెదిరిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు జంతువులు కూడా బంకర్లలోనే తలదాచుకుంటున్నాయని చెప్పారు.
జంతువులపై తనకు ప్రేమ కలగడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఆయన చెబుతారు. చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందానని ఆయన అన్నారు. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పెంపుడు జంతువుల కోసం అక్కడే ఉండిపోయాడు. డాక్టర్ మాటలకు హృదయం ద్రవించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఒక నోట్ రాసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"ప్రియమైన డాక్టర్. గిరి కుమార్ పాటిల్,
మీరు జాగ్వార్, పాంథర్స్ ను చాలా ప్రేమగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ దురదృష్టకర సమయంలో మీరు వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవటం నిజంగా నన్ను కదిలించి వేసింది. యుద్ధ సమయంలో మీరు మీ పెంపుడు జంతువులు పాంథర్, జాగ్వార్‌ల సంరక్షణ కోసం ఉక్రెయిన్‌లోనే ఉండాలను కోవడం నిజంగా అభినందనీయం. మూగ జీవుల పట్ల మీకు ఉన్న కరుణ, ప్రేమ ప్రశంసనీయం. ఈ సమయంలో మీ భద్రత కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నాను. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి.. మీ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు దేవుని ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి అని ట్విట్టర్ వేదికగా ! చిరంజీవి పోస్ట్ పెట్టారు.
#TeluguDoctor #UkraineWar #Jaguar #Panther #compassion #petlovers https://t.co/XqyUT6ebbN pic.twitter.com/balOzxRj26
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com