Chiranjeevi : కేరళ సిఎమ్ తో చిరంజీవి భేటీ.. అందుకేనా..?

Chiranjeevi : కేరళ సిఎమ్ తో చిరంజీవి భేటీ.. అందుకేనా..?
X

మెగాస్టార్ చిరంజీవి కేరళ వెళ్లాడు. అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ఆయన భేటీ కానున్నారు. ఇటీ వల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే ధ్వంసం అయిపోయాయి. వందలాదిమంది మరణించారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంతో తెలుగుతో పాటు తమిళ్ సినిమా పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీస్ తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 1 కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయబోతున్నట్టు ప్రకటించారు.

ఇవాళ పినరయి విజయన్ ను స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ ను అందివ్వబోతున్నాడు చిరంజీవి. అందుకే కేరళ వెళ్లాడు. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో చెక్కులను ఎవరితో అయినా పంపిస్తారు. లేదా ఆ అకౌంట్ కు జమ చేస్తారు. బట్ మెగాస్టార్ స్వయంగా అక్కడికి వెళ్లి సిట్యుయేషన్ ను కూడా చూడాలనుకుంటున్నాడు. అందుకే చెక్ ను డైరెక్ట్ గా అందించబోతున్నాడు.

Tags

Next Story