Chiranjeevi : శ్రీకాంత్ డైరెక్షన్ లో చిరంజీవి..?

Chiranjeevi :  శ్రీకాంత్ డైరెక్షన్ లో చిరంజీవి..?
X

మెగాస్టార్ దూకుడు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నా.. ఆయన మాత్రం కామ్ గా తన పనేదో తను చూసుకుంటూ వెళుతున్నాడు. వశిష్ట డైరెక్షన్ లో ఆయన నటించిన విశ్వంభర సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా.. గ్రాఫిక్స్ బాలేదని పోస్ట్ పోన్ చేశారు. మరోసారి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను జోడిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అన్నీ కుదిరితే సమ్మర్ లో విడుదల కావొచ్చు అంటున్నారు. ఈ టైమ్ లో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఫస్ట్ మూవీ దసరాతో ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే ఒక వార్త హల్చల్ చేస్తోంది. కానీ దీనికి సరైన బేస్ అంటూ ఏం లేదు. రాండమ్ గాసిప్ లా కనిపిస్తోంది. అదే టైమ్ లో ఇప్పుడు మెగాస్టార్ ఎంపిక చేసుకుంటోన్న దర్శకులను చూస్తే.. పూర్తిగా గాసిప్ అని కొట్టి పడేయలేం కూడా.

నాని లాంటి క్లాస్ హీరోను ఊర మాస్ గా చూపించాడు శ్రీకాంత్. అందుకే మరోసారి అతనికే అవకాశం ఇచ్చాడు నాని. ఈ కాంబోలో రెండో సినిమాగా ఇప్పుడు ‘ద ప్యారడైజ్’వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ మొదలైంది. దీంతో పాటు హిట్ 3 లోనూ బిజీగా ఉన్నాడు నాని. ప్యారడైజ్ పూర్తి కావడానికి ఎంత లేదన్నా ఆరు నెలలు పడుతుంది. ఆరు నెలల తర్వాత చిరంజీవితో సినిమా అనేది అప్పుడే గ్యారెంటీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మెగాస్టార్ ఏదీ ఓ పట్టాన ఒకే చేయరు. సో.. ప్రస్తుతానికి ఇది రూమర్ గానే భావిస్తే పోలా.?

Tags

Next Story