Chiranjeevi : మెగాస్టార్ విశ్వంభర అప్డేట్స్

Chiranjeevi :  మెగాస్టార్ విశ్వంభర అప్డేట్స్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్ట్ చేసిన విశ్వంభర మూవీ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. ఒక్క రిలీజ్ డేట్ విషయం తప్ప. అయితే ఆ డేట్ కూడా దగ్గరకు వస్తున్నట్టుగా తాజా అప్డేట్స్ చూస్తే అర్థం అవుతుంది. ఈ మూవీ నిజానికి ఈ యేడాది సంక్రాంతికే విడుదల కావాలి.కానీ నాసిరకరమైన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా టీజర్ కే విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతో బెస్ట్ అవుట్ పుట్ కోసం ఆపేశారు. మరోసారి విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు. వీరంతా వేర్వేరు లోకాల గంధర్వ కన్యలుగా కనిపిస్తారని టాక్. కథా పరంగా కూడా ఇది 14 లోకాలకు సంబంధించిన కథ అన్నారు. తన హీరోయిన్ ను వెదుకుతూ హీరో 13 లోకాలను దాటి సత్య లోకం చేరే వరకూ సాగించే ప్రయాణం అని దర్శకుడే చెప్పాడు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయట. వీటిలో ఓ పాటను ఈ నెల 25 నుంచి చిత్రీకరించబోతున్నారు.ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ నర్తించబోతోంది. ఈ పాటతో పాటు ఓ రెండు రోజుల ప్యాచ్ వర్క్ ఉందట. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు.సో.. దీన్ని బట్టి చూస్తే.. ఆల్రెడీ విఎఫ్ఎక్స్ వర్క్ చివరి దశలో ఉన్నట్టే. ఇక ఈ పాట, ప్యాచ్ వర్క్ పూర్తయితే చిరంజీవి ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా రిలీవ్ అయినట్టే అనుకోవచ్చు.

Tags

Next Story