Suma Adda: బుల్లితెర సూపర్ స్టార్ vs సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్.. సుమ అడ్డాలో వాల్తేరు వీరయ్య..
Suma Adda: సుమ క్యాష్ అంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న గేమ్ షో. ఇక ఇప్పుడు ఈ షోని ముగించి కొత్త ప్రోగ్రామ్‌కి తెరలేపింది సదరు ఛానల్.. అది కూడా సుమతోనే.. ఆ ఛానల్ ఆస్థాన విద్వాంసురాలుగా మారిపోయింది సుమ.. ఆమె లేకపోతే బుల్లి తెరకు కళ ఎక్కడిది. అందుకే పేరు మార్చి, కంటెంట్‌ని కూడా కొత్తగా డిజైన్ చేసి సుమ అడ్డాగా మరో షో తీసుకు వచ్చింది.
ఇందులో సుమ వచ్చే గెస్ట్‌లను ఇంటర్వ్యూ చేస్తుంది తనదైన స్టైల్‌లో. ఎక్కడైనా తన మార్కు చూపించే సుమకు ఇది ఓ లెక్కా.. ఎవ్వరినైనా ఇరుకున పట్టించేస్తుంది.. నవ్వుతూ, నవ్విస్తూనే విషయాన్ని రాబట్టేస్తుంది. ఇక ఈ షోకి సంతోష్ శోభన్ ఫస్ట్ గెస్ట్‌గా రానున్నాడు.
రెండో ఎపిసోడ్‌కి వాల్తేరు వీరయ్యగా సంక్రాతి బరిలోకి దిగనున్న చిరంజీవి, దర్శకుడు బాబీ కూడా వస్తున్నారట. మెగాస్టార్‌ని కూడా తన అడ్డాకి రప్పించిందంటే సుమ లెవలేంటో మనకి ఆ మాత్రం తెలియదా ఏవిటి. వాల్తేర్ వీరయ్య ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి ఈ షోకు రావడం సుమకే కాదు బుల్లితెర ప్రేక్షకులకు బోలెడంత ఆనందం.
ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్‌గా సందడి చేయనుంది. షో నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చిరంజీవికి ఉన్న అనుబంధం కారణంగా వాళ్లు అడగడంతో చిరంజీవి మరేం ఆలోచించకుండా ఓకే చేశారట. సుమతో ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఓకే అనాల్సిందే మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com