Chiyaan Vikram : మొదటి సారి ట్విట్టర్‌లో చియాన్ విక్రమ్.. ఏమన్నాడంటే..?

Chiyaan Vikram : కోలీవుడ్ మరో కమల్ హాసన్ చియాన్ విక్రమ ట్విట్టర్ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఆనందం నెలకొంది. ఇటీవళ విక్రమ కొంత అనారోగ్యానికి గురయి మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల అభిమానుల్లో కొంత ఆందోళన మొదలైంది. సినీ కెరీర్ మొదటి నుంచీ ఆయన మీడియాకు ఆతరువాత సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
ఇప్పటి వరకు చియాన్‌కు సొంతంగా ఫేస్‌బుక్ అకౌంట్ లేదంటే నమ్ముతారా. ఫ్యాన్స్ అభ్యర్ధనమేరకు ఆయన 2016లో ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. తాజాగా నిన్ని రాత్రి 8గంటలకు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో మొదటి వీడియో పోస్ట్ చేశారు.
'నేను మీ చియాన్ విక్రమ్.. డూప్ కాదు ఒరిజినల్.. కొత్త సినిమా కోసం ఇలా గెటప్ అయ్యా.. ఆలస్యంగా వచ్చినందుకు ఏం అనుకోకండి.. ఇప్పటి నుంచి నేను మీకు ట్విట్టర్‌లోనూ అందుబాటులో ఉంటా. నా పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ధన్యవాదాలు' అని మొదటి ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com