Jani Master : జానీమాస్టర్ అసలు ఏం చేశారు.. జరిగిన విషయం ఏంటి?

Jani Master : జానీమాస్టర్ అసలు ఏం చేశారు.. జరిగిన విషయం ఏంటి?
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై 372(2), 506, 328 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా కొరియో ఫార్ 2017లో హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్లో ఓ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా సెలక్ట్ అయ్యింది. అదే సమయంలో జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని జానీ మాస్టర్ కోరడంతో అతని టీమ్ లో జాయిన్ అయ్యింది. కాగా ఓ ప్రాజెక్ట్ కోసం ముంబయి వెళ్లిన సమయంలో టికెట్లు ఇబ్బంది కారణంగా తన తల్లికి టికెట్ దొకలేదు. దీంతో తానొక్కతే జానీ మాస్టర్ తో ముంబై వెళ్లింది. ఇదే అదనుగా భావించిన జానీ మాస్టర్ ముంబయిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె కంప్లయింట్ చేసింది.

ముంబయిలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. ఆ భయంతో పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినా, ఎవ్వరికీ చెప్పలేదని, షూటింగ్ కు సంబంధించిన వాహనంలో కూడా తనను లైంగికంగా పలు మార్లు వేధించాడని తెలిపింది. అందరి ముందు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని లైంగిక వేధింపులకు ఒప్పుకోలేదని తన తలను అద్దానికి వేసి కొట్టాడని ఫిర్యాదులో వివరించింది.

అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇంటికి వచ్చి స్కూటీని ధ్వంసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకోవాలని జానీ మాస్టర్ తను పెళ్లి చేసుకోవాలని వేధించాడని, ఇందుకు మతం మార్చుకోలేని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడాడని పోలీసులకు వివరించింది. ఇటీవల తాను టీమ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పని చేసుకుంటుంటే భార్యతో కలిసి ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని తెలిపింది. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందు ఉందని, దానిపై ఇదే తన చివరి షూటింగ్ అని రాసి ఉందని బాధి తురాలు ఆందోళన వ్యక్తం చేసింది. తనకు అవకాశాలు లేకుండా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన బాధితురాలిని పోలీసులు 3 గంటల పాటు విచారించారు.

Tags

Next Story