Interstellar : పబ్లిక్ డిమాండ్.. మళ్లీ వస్తోన్న ఇంటర్ స్టెల్లార్

క్రిస్టఫర్ నోలాన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావి అయిన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆలోచనలన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ లా ఉంటాయి. ఆ మేరకే సినిమాలూ కనిపిస్తాయి. నోలన్ సినిమాలు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి అంటారు. ఇక ఆయన గత సినిమాల్లో ఒకటైన ఇంటర్ స్టెల్లార్ అయితే చాలామందికి అర్థం కాలేదు. కానీ కాలేదు అంటే వాళ్లను ఎక్కడ తెలివి తక్కువ వాళ్లు అంటారనో.. చాలామంది చప్పట్లు కొట్టేశారు. భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేదైనా పాలపుంతలొ మనుష్యులు జీవించుటకు అనువైన స్థలం ఉందేమో వెతుకుటకు బయలు దేరిన నలుగురు వ్యొమగాములు కథ ఇది. ఈ క్రమంలో వారికి అంతరిక్షంలో ఎదురైన సమస్యలేంటీ.. ఆ సమస్యలను దాటుకుని తిరిగి భూమిని చేరారా లేదా అనేది కోణంలో సాగే కథనం అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి కోట్లమంది అభిమానులు కూడా ఉన్నారు. వారి కోసమే రీ రిలీజ్ అవుతోందిప్పుడు.
అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత డీ కోడ్ చేయడం ద్వారా అందరూ అర్థం చేసుకోగలిగారు. అప్పటికే సినిమా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారనే కారణంతో ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. అది కూడా ఈ 14నే.
ఇండియాలో ఈ నెల 14న థియేటర్స్ లో పాటు ఐమాక్స్ లోనూ ఇంటర్ స్టెల్లార్ విడుదల కాబోతోంది. అయితే కేవలం 7 రోజులు మాత్రమే ప్రదర్శిస్తారట. లిమిటెడ్ రన్ అన్నమాట. కాకపోతే దీనికి సంబంధించిన ప్రచారం పెద్దగా కనిపించడం లేదు. అందుకే చాలామందికి తెలియదు. మరి ఇలా తెలియని సినిమాను పబ్లిక్ డిమాండ్ మేరకు అని ఎందుకు అన్నారో కానీ.. అప్పుడు మిస్ అయిన వాళ్లే కాదు.. అప్పుడు అర్థం కాక డీ కోడ్స్ ద్వారా మూవీ గురించి తెలుసుకున్న వాళ్లూ ఇప్పుడు మరోసారి సినిమాను చూడొచ్చు. మరి ఈ సారి హ్యాపీగా అర్థం చేసుకుంటారా లేక అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com