Dinesh Phadnis : వెంటిలెటర్ పై 'సీఐడీ' నటుడు

దినేష్ ఫడ్నిస్ పోషించిన CID ఇన్‌స్పెక్టర్ ఫ్రెడరిక్స్ కు సంబంధించిన హెల్త్ అప్‌డేట్ బయటకు వచ్చింది. గత రాత్రి ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు CIDలో అతనితో పాటు నటించిన, సహనటుడు దయానంద్ శెట్టి తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. దినేష్ ఫడ్నిస్‌కు గుండెపోటు రాలేదని, అయితే దానికి వేరే కారణం ఉందని, కానీ దాన్ని తాను పంచుకోవడానికి అనుమతించలేదని అతను చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అతను గుండెపోటుతో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించాడు. ఫడ్నిస్ వెంటిలేటర్‌పై ఉన్నాడని వెల్లడించాడు. దినేష్ ఫడ్నీస్, దయానంద్ శెట్టి నిజ జీవితంలో చాలా మంచి స్నేహితులు.
ఏ ఆసుపత్రిలో చేరాడంటే..
డిసెంబర్ 2న రాత్రి దినేష్ ఫడ్నిస్‌కు గుండెపోటు వచ్చిందని, ముంబైలోని తుంగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారని చెబుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే అతని ఆరోగ్యం ఎందుకు క్షీణించిందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు.
దినేష్ ఫడ్నిస్ వయస్సు
57 ఏళ్ల దినేష్ ఫడ్నిస్ CIDలో ఫ్రెడరిక్స్ అత్యంత ఫన్నీ అండ్ శక్తివంతమైన పాత్రను పోషించాడు. ఈ షో టీవీలో 1998 నుండి 2018 వరకు నడిచింది. ఈ షోలోని ప్రతి పాత్ర ఇప్పటి వరకు చాలా ప్రజాదరణ పొందింది. CID ఫేమ్ దినేష్ ఫడ్నిస్ వెంటిలేటర్‌పై జీవన్మరణ యుద్ధంతో పోరాడుతున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కూడా ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతన్ని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు.
దినేష్ ఫడ్నిస్ సినిమాల్లోనూ నటించాడు..
టీవీలోనే కాదు, సినిమాల్లో కూడా దినేష్ ఫడ్నిస్ పనిచేశారు. అతను అమీర్ ఖాన్ సర్ఫరోష్ నుండి హృతిక్ రోషన్ సూపర్ 30 వరకు ప్రతిదానిలోనూ నటించాడు. ప్రస్తుతం, అభిమానులందరూ అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com