Cinema : షూటింగ్ లో విశాల్ కు మరోసారి ప్రమాదం

Cinema : షూటింగ్ లో విశాల్ కు మరోసారి ప్రమాదం
విశాల్ మీదకు దూసుకువచ్చిన వాహనం; సాంకేతిక లోపం వల్లే....

యాక్టర్ విశాల్ కు మరోసారి షూటింగ్ లో ప్రమాదం జరిగింది. అయితే విశాల్ కు ఎలాంటి గాయాలు కాలేదు.విశాల్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. దీంట్లో భాగంగా ఓ ఫైట్‌ సీన్‌ తీస్తున్నారు. సీన్‌లో విశాల్‌తో పాటు చాలా మంది ఫైటర్స్ ఉన్నారు.ఆగకుండా ముందుకు వాహనం దూసుకు వచ్చింది. టెక్నికల్‌ ఇష్యూ వల్లే ఇలా జరిగిందని,లక్కీగా విశాల్‌ ప్రాణాలతో బయటపడ్డారని యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఈ వీడియోని విశాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొన్ని ఇంచ్‌ల దూరంలో చావు కనిపించిందంటూ కామెంట్‌ చేశారు. తర్వాత షూటింగ్‌ యాధావిధిగా కొనసాగిందన్నారు విశాల్‌. చెన్నై శివారులోని EVP ఫిలింసిటీలో విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోనీ మూవీ షూటింగ్ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story