sirivennela sitaramasatri : సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

సిరివెన్నెల హఠాన్మరనంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తమను వదిలివెళ్లిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన రాసిన ప్రతిపాట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
"మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
— dev katta (@devakatta) November 30, 2021
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Deeply saddened to hear the news of Sri #SirivennelaSitaramasastri Garu's demise. A great lyricist who has given us the most beautiful songs to reminisce and who won the hearts of people with his incredible work. Condolences to the family. pic.twitter.com/LIbuf0cyqF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2021
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం బాధాకరం. ఆయన రాసిన ప్రతీ పాట తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఎన్నో భావగర్భితమైన పాటలు వ్రాసి సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. pic.twitter.com/YXSmPoGBh1
— Harish Rao Thanneeru (@trsharish) November 30, 2021
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 30, 2021
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
— Jr NTR (@tarak9999) November 30, 2021
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/O1fgNJEqau
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com