Theaters bandh : సినిమాలు బంద్.. ఆగిపోయింది

Theaters bandh :  సినిమాలు బంద్.. ఆగిపోయింది
X

జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను బంద్ చేస్తున్నాం అని గత కొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తోంది. సినిమాను రెంటల్, షేరింగ్ అంశాల్లో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగానే బంద్ ప్రకటించారు ఎగ్జిబిటర్లు. దీనికి ఇండస్ట్రీలోని నిర్మాతలు కూడా రెండు వర్గాలుఅయ్యారు అనే టాక్ వినిపించింది. మరికొందరు కావాలనే ఈ గందరగోళాన్ని సృష్టించి.. మళ్లీ వాళ్లే సమస్యను పరిష్కరించి తామేదో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్న ఫీలింగ్ తెచ్చేలా వెనక నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాకూ వచ్చింది. మొత్తంగా ఈ నెల 30నుంచి జూలై 4 వరకూ ఐదారు పెద్ద సినిమాలున్నాయి. ఇవన్నీ థియేటర్స్ కు ప్రాఫిట్స్ తెచ్చే మూవీస్ లానే కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బంద్ అంటే ఆ పెద్ద సినిమాలు నష్టపోతాయి. ఇటు థియేటర్స్ సైతం నష్టపోతాయి. అందుకే మరోసారి పెద్దలంతా కూర్చుని బంద్ వ్యవహారాన్ని కొంత కాలం పాటు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన టైమ్ లో కూడా కొందరు నిర్మాతలు అసంతృప్తిగా, మరికొందరు అసహనంగా కనిపించడం విశేషం.

ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జెనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి.. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటించారు.. ఈనెల 30న విశాఖపట్నంలో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఈ అంశం పై చర్చ జరగబోతోంది. ఆ తరువాత వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం.. అంచేత ఇప్పట్లో థియేటర్లో మూసివేత అనే కార్యక్రమం లేదు అని తేల్చి చెప్పారు.

Tags

Next Story