Akhanda 2 : బాలయ్య అఖండ 2కు రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చేసింది

Akhanda 2 :  బాలయ్య అఖండ 2కు రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చేసింది
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2కు లైన్ క్లియర్ అయింది. రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 5న విడుదల కావాల్సిన మూవీ కొత్త రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనేక సందేహాలు వినిపించాయి. బట్ ఫైనల్ గా అన్నీ క్లియర్ అయింది. ఇష్యూ జరిగిన మూడు నాలుగు రోజుల్లోనే మేటర్ క్లియర్ చేశారు మేకర్స్. అంతా అనుకున్నట్టుగా డిసెంబర్ 12నే ఈ మూవీ విడుదల కాబోతోంది. యస్.. ఈ మూవీకి అన్ని ప్లాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేశారు. డిసెంబర్ 12నే విడుదల కాబోతోంది. అంతే కాదు.. ముందు అనుకున్నట్టుగానే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు.

మొత్తంగా ఈ సమస్య క్లియర్ చేయడం మాత్రం పెద్ద ప్లస్ పాయింట్ అయింది.అదే రోజున విడుదల కావాల్సిన చిత్రాలు మాత్రం పెద్ద డైలమా పడబోతున్నాయి. నిజానికి ఈ 12నే ఆరేడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆ డేట్ ను అనౌన్స్ కూడా చేశారు కూడా. ఇప్పుడీ టైమ్ లో కొత్త రిలీజ్ డేట్ వేయడం మాత్రం వారికి చాలా కష్టమే అవుతుంది. అదే టైమ్ లో అఖండ 2 తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా కష్టమే. మొత్తంగా ఆ సినిమాలన్నీ మాత్రం చాలా ప్రాబ్లమ్స్ లో పడబోతోంది అనే అర్థం. ఒకవేళ కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తే మాత్రం డిసెంబర్ 18న లేదా డిసెంబర్ లాస్ట్ వీక్ లో మాత్రం వేయొచ్చు. ఏదేమైనా బాలయ్య మూవీ మాత్రం తగ్గకపోవడం లేదు.

Tags

Next Story