NTR : ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే

NTR :  ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ వరకూ ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో దేవర చేశాడు. స్టార్ హీరోగా ఇన్నేళ్ల గ్యాప్ ను ఫిల్ చేయాలనే ఈ దూకుడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్ లో ఉన్నాడు ఎన్టీఆర్. తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి మార్చిలో అడుగుపెడతాడు. ఇది రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే చిత్రం. నిజానికి గతేడాది నవంబర్ లోనే సెట్స్ పైకి వెళ్లాలి. అప్పుడే ఎన్టీఆర్ కూడా జాయిన్ కావాలి. అనుకోని కారణాలతో ఆలస్యం అయింది. దీంతో వీళ్లు ఓపెనింగ్ టైమ్ లోనే చెప్పిన రిలీజ్ డేట్ 2026 జనవరి 9 కి రిలీజ్ సాధ్యం కాదేమో అనుకుంటున్నారు. బట్ ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడట. ఇంత లేట్ అయినా ఆ టైమ్ కు ఖచ్చితంగా విడుదల చేస్తారు అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత దేవర 2 ఉంటుందనుకున్నారు. కానీ ఎన్టీఆర్ వేరే ప్లానింగ్ లో ఉన్నాడు.

కొన్ని రోజులుగా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేశారు. నెల్సన్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తాడు. ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ఆరంభంలో ఉంటుందట. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇటు ఎన్టీఆర్ ఎలాగూ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉంటాడు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ నుంచి రిలాక్స్ కాగానే అన్నీ కుదిరితే 2026 అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటున్నారు. అదీ మేటర్.

Tags

Next Story