Dhanush-Aishwarya : ధనుష్, రజినీకి తేడా ఎక్కడొచ్చింది?

Dhanush-Aishwarya : టాలీవుడ్ స్టార్ కపుల్స్ నాగచైతన్య, సమంత డైవర్స్ ఎంత హాట్ టాపిక్ అయిందో అంతకుమించి కోలీవుడ్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. కోలీవుడ్‌లో ఓ స్టార్ కపుల్స్ విడిపోతున్నారని గతకొంత కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఆ జంట ఎవరనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గా ఉంది.
తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ సస్పెన్స్‌కు తెరదించారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్‌కార్డు వేశారు. విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా స్వయంగా ధనుష్, ఐశ్వర్య వేర్వేరుగా వెల్లడించారు. విడాకుల ప్రకటనకి ముందు తమ నిర్ణయాన్ని రజినీకాంత్‌కి వెల్లడించారట.. అయితే రజినీకాంత్ ఆ నిర్ణయాన్ని వారిద్దరకే వదిలేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలావుండగా రజినీ విషయంలో కూడా ధనుష్ తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారట.. రజినీకాంత్ హీరోగా వచ్చిన కాలా సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రజినీకాంత్ తనని ఆర్థికంగా ఆదుకోలేదని ధనుష్ తీవ్ర అసంతృప్తిగానే ఉన్నాడట... దీనికి తోడు ధనుష్‌తో ఐశ్వర్య ఓ పాన్ ఇండియా సినిమా నిర్మించాలని ప్లాన్ చేసిందట.
కానీ దీనికి ధనుష్ ఒప్పుకోలేదట. ఈగోల కారణంగానే వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. కాగా ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com