CM Revanth Reddy : టాలీవుడ్ పై సిఎమ్ రేవంత్ రెడ్డి అసహనం

CM Revanth Reddy : టాలీవుడ్ పై సిఎమ్ రేవంత్ రెడ్డి అసహనం
X

స్టేట్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది సినిమా పరిశ్రమ. కాకపోతే ఏపిలో గత ఐదేళ్లలో మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోలేదు. అటు ఆ ప్రభుత్వాధినేత కూడా టాలీవుడ్ ను అవమానించే విధంగానే ఎప్పుడూ ప్రవర్తించాడు. ఇప్పుడు రెండు స్టేట్స్ లోనూ ఫిల్మ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉన్నాయి. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై కాస్త అసహనం ప్రదర్శించాడు. తాజాగా ప్రముఖ తమిళ రైటర్, ఉద్యమకారుడు అయిన శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ప్రదానోత్సవం చేసిన సందర్భంగా టాలీవుడ్ ను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేశాడు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు నంది అవార్డ్ స్థానంలో ఆ పేరును మార్చి గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇస్తాం అని ప్రకటించింది. సినిమా వాళ్లకు గద్దర్ పేరుతో అవార్డ్ ఏంటీ అని కొందరు.. ఇస్తే ఏంటీ అని ఇంకొందరు అప్పుడే చర్చలు చేశారు. అయితే ఆయన పేరుతో ఇచ్చే అవార్డ్ ల విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సలహాలూ, సూచనలను కూడా ముఖ్యమంత్రి తీసుకుంటా అని చెప్పాడు. బట్ ఆయన చెప్పి ఇన్నిరోజులైనా టాలీవుడ్ పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని కామెంట్స్ చేశాడు రేవంత్ రెడ్డి.

గద్దర్ విప్లవ పార్టీలో ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో ప్రజా ఉద్యమాలకు పాటై వెలిగాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఎంతోమందితో సన్నిహితంగా ఉన్నాడు. చాలా సినిమాల్లో పాటలు రాశాడు. రెండు పాటలకు నంది అవార్డ్ లు కూడా వచ్చాయి. అయినా ఆయన్ని ఇండస్ట్రీ ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు అనేది నిజం. ఆ కారణంగానే ఆయన పేరుతో ఇచ్చే అవార్డ్స్ ఎందుకు అనుకున్నారా లేక నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరూ పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారా.. అనేది తెలియాలి. ఏదేమైనా సిఎమ్ స్వయంగా మరోసారి గుర్తు చేశాడు కాబట్టి.. ఈ అంశంలో ఏదైనా కదలిక వస్తుందేమో చూద్దాం.

Tags

Next Story