సినిమా

SS Thaman: టాలీవుడ్‌లో హీరో నాని Vs తమన్! ఈ కోల్డ్ వార్ ఇప్పటిది కాదు..

SS Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫార్మ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు ఎస్ఎస్ తమన్.

SS Thaman: టాలీవుడ్‌లో హీరో నాని Vs తమన్! ఈ కోల్డ్ వార్ ఇప్పటిది కాదు..
X

SS Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫార్మ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు ఎస్ఎస్ తమన్. తమన్ ఏ సినిమాకు మ్యూజిక్ అందించినా.. అది మ్యూజికల్ హిట్ అవుతుందని ప్రేక్షకులు నమ్మడం మొదలుపెట్టారు. అందుకే పాన్ ఇండియా సినిమాలు సైతం తమనే మ్యూజిక్ డైరెక్టర్‌గా కావాలని ఎదురుచూస్తున్నాయి. అయితే తాజాగా తమన్‌కు ఓ టాలీవుడ్ హీరోతో జరుగుతున్న కోల్డ్ వార్ వైరల్‌గా మారింది,

'శ్యామ్ సింగరాయ్' ప్రమోషన్స్‌లో భాగంగా నేచురల్ స్టార్ నాని.. ఎన్నో సెన్సేషనల్ కామెంట్స్‌ను చేశారు. అలాగే తన సినిమాలోని సంగీతం గురించి మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్‌లో అన్ని క్రాఫ్ట్స్ లాగానే మ్యూజిక్‌కు కూడా సమానంగా ప్రాధాన్యం ఉంటుంది అన్నాడు. సంగీతం లేదా బీజీఎం సినిమాను ఎలివేట్‌ చేయాలే తప్పా.. డామినేట్‌ చేయకూడదని, లేదంటే శృతి తప్పుతుందిని అన్నాడు.

నాని అన్న మాటలకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇస్తు్న్నట్టుగా వరుసగా ట్వీట్‌లు చేస్తున్నాడు తమన్. అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్‌ దేనిని డామినేట్‌ చేయదని తన ట్విట్ ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించాడు తమన్. అయితే అఖండ సినిమాను తమన్ బీజీఎం డామినేట్ చేసిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అదే విషయాన్ని ఉద్దేశించి నాని మాట్లాడాడో లేదో తెలీదు కానీ తమన్ మాత్రం నానికి ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చే విధంగానే ట్వీట్ చేశాడు అనుకుంటున్నారు నెటిజన్లు.

నాని, తమన్ మధ్య కోల్డ్ వార్ ఈనాటిది కాదు.. 'టక్ జగదీష్' సినిమా సమయం నుండి వీరి మధ్య ఇది నడుస్తుంది. టక్ జగదీష్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ముందుగా తమన్‌ను ఎంపిక చేసింది మూవీ టీమ్. అయితే తమన్ అందించిన మ్యూజిక్ నానికి నచ్చలేదు. దీంతో తనను ప్రాజెక్ట్ నుండి తొలగించారు. అయితే టక్ జగదీష్‌కు కష్టపడి సంగీతం అందించినా కూడా నానికి నచ్చలేదని, అప్పుడు చాలా ఫీల్ అయ్యానని తమన్ బహిరంగంగానే వెల్లడించాడు.


Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES