Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కిక్కిచ్చే సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆడియన్స్ లో రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇక పాటలోనే అంతా కిక్కే ఉందంటే చెప్పేదేముందీ.. అలాగే ఉంది ఈ పాట. ‘ఎక్కి తొక్కేటోల్లే వున్న తగ్గేదేంవుందే అరె ఎక్కే దాకా తిక్కేఉండలే..’అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేసింది టీమ్. ఈ పాటలో అన్ని నిజాలే ఉండేలా ఉంది సాహిత్యం. అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా సాగే సాహిత్యం ఇది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట వింటూనే ఓ ఊపు వచ్చేలా ఉంది. సినిమాలో మాంటేజ్ సాంగ్ లా ఉంటుందట. అంటే కంప్లీట్ సాంగ్ గా ఒక్కసారిగా వినే అవకాశం లేదు. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలకు తగ్గట్టుగా మాంటేజ్ సాంగ్ లా ఉండబోతోంది. మొదట చాలామంది ఈ పాట సినిమాలో ఉండదు అంటూ కొంతమంది తెగ రాసుకున్నారు.. చెప్పారు. బట్ అలాంటిదేం లేదు అని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడు. ట్యూన్ అదరగొట్టాడు దేవీ శ్రీ ప్రసాద్. అతనిలోనూ ఓ జోష్ కనిపించేలా ఉందీ పాట. అంతకు మించిన పవర్ ఫుల్ గా పాడాడు రామ్ మిర్యాల. అతని గాత్రంతో పాట మరో స్థాయిలోకి వెళ్లిపోయింది. మొత్తంగా ఈ పాట ఓ జోష్ నింపేలా ఉంది.
ఇక శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఇది. ఇక ఈ నెల 14న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. మరి ట్రైలర్ లాంచింగ్ కు పవన్ కళ్యాణ్ రాకపోవచ్చు. బట్ 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం గ్యారెంటీ. సినిమా 19న విడుదల కాబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
